BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, సారపాక ఐటీసీలో మంత్రి సీతక్కను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నేతలు అభినందించారు.