PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, భక్తికి ప్రతీక బక్రీద్ అని, అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. భక్తి శ్రద్దలతో జరిపే అందరి ప్రార్థనలు ఫలించాలని తెలిపారు. ఏపీలో కుల,మతాల ఐక్యతను పెంచిన ఘనత టీడీపీ దేనని, ఆయన హయాంలోనే పండుగలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు.