కాకినాడ: మహానాడు వేదికగా విరాళాలు సేకరించడం టీడీపీకి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సతీశ్ టీడీపీ పార్టీకి రూ.1.50 కోట్ల భారీ విరాళాన్ని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను మహానాడు వేదికపైనే అభినందించారు. పార్టీ బలోపేతానికి, సేవా కార్యక్రమాలకు సతీశ్ చేస్తున్న సేవలను సీఎం అభినందించారు.