SRD: రాష్ట్రంలో నర్సింగ్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జీఎన్ఎం పూర్తి చేసిన విద్యార్థులకు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో మరిన్ని అవకాశాలు కల్పించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అలాగే 10 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు, ఒక పీజీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.