TG: మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమీర్పేట మైత్రీవనం చౌరస్తాలో సీఎం రేవంత్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై రేవంత్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు.