ASR: ప్రభుత్వ పథకాలు, కనీస వసతులు ప్రజలకు సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ నిశాంతి అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటి శాశ్వత పరిష్కారానికి తగిన ప్రణాళికలను రూపొందించాలని బుధవారం అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఆశాలు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, అధికారులు ప్రజల సమస్యలు గుర్తించాలన్నారు.