తూ.గో: బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. ప్రజలంతా పరస్పర గౌరవం, సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు, జిల్లా ప్రజలందరికీ ఎస్పీ హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.