PDPL: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సంక్షేమమే ముఖ్యమన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, పాల్గొన్నారు.