మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఈనెల 25న రైలులో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎండి, రేహాన్, రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు, మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి బంగారం 6 మొబైల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.