MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో ఓ మైనర్ బాలికపై మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడనే విషయం చర్చనీయాంశమైంది. బాలిక గర్భవతి అని తెలియడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బాలుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.