SS: పుట్టపర్తిలో కురిసిన భారీ వర్షానికి ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన ద్వారం వద్ద పెద్ద చెట్టు నేలకొరిగింది. దీంతో రోగులు లోపలికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల వ్యాప్తంగా 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెట్టును తొలగించడంలో మున్సిపల్, అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని స్థానికులు మండిపడుతున్నారు.