SDPT: చిన్నకోడూరు మండల వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో పాటు, తూకం వేసిన ధాన్యం బస్తాలు కొంతమేర తడిశాయి. తడిసిన ధాన్యాన్ని, బస్తాలను రైతులు ఆరబెడుతున్నారు. గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.