ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.