ELR: జిల్లాలో అక్షర ఆంధ్ర కార్యక్రమ నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 96,836 మంది నిరక్షరాస్యులను అభ్యాసకులుగా గుర్తించామన్నారు. వీరి వివరాలను యాప్లో నమోదు చేసి, షెడ్యూల్ ప్రకారం తరగతులు నిర్వహించి అక్షరాస్యులుగా మార్చాలన్నారు.