SRD: కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఎన్యుమరేటర్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఐడీ కార్డును తనిఖీ చేశారు. ఇప్పటివరకు హౌస్ లిస్టింగ్ ఎంత శాతం పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. జనగణన ప్రక్రియను పక్కాగా, తప్పులు లేకుండా నిర్వహించాలని సూచించారు.