SKLM: ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని డీఎస్పీ వివేకానంద అన్నారు.శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బందికి హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పోలీసు విధులు అత్యంత ఒత్తిడితో కూడుకున్నవని,అలాంటి పరిస్థితుల్లో ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.