కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం అధికారులను హెచ్చరిస్తూ రెవెన్యూ సేవల్లో ఎలాంటి ఆలస్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. భూ రీ-సర్వేను గడువులోగా పూర్తి చేసి, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. 22A నిషేధిత భూముల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, భూ వివాదాల నివారణకు పాత రికార్డులను వంద శాతం డిజిటలైజేషన్ చేయాలన్నారు.