కృష్ణా: బాపులపాడు(M) హనుమాన్ జంక్షన్ సమీపంలోని కె.సీతారామపురం రోడ్డుపై గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల మహిళ వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేవీ బ్లూ టాప్, గ్రీన్ లెగ్గిన్ ధరించి ఉండగా, కుడి చేతికి ఎరుపు మట్టి గాజులు ఉన్నాయి. గుర్తించిన వారు హనుమాన్ జంక్షన్ పోలీసులకు సమాచారం తెలపాలన్నారు.