SRCL: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 33వ వార్డులో మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిని-నరేష్ ఘనంగా ప్రారంభించారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు మున్సిపల్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.