TG: ఆఫ్రికా దేశాలను ఎబోలా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఎబోలా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని సూచించింది.