MHBD: మహబూబాబాద్ మండలం సండ్రల గూడెం గ్రామంలో సంఘం మధు (21) అనే యువ రైతు అప్పుల బాధ భరించలేక ఇవాళ తెల్లవారుజామున తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై రూరల్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు.