»In Fight Over Private Pics Big Relief For Bureaucrat Rohini Sindhuri
IPS Roopa Vs IAS Rohini: రూప వ్యాఖ్యలు.. కోర్టులో రోహిణికి బిగ్ రిలీఫ్
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువారం రూపకు ఆదేశాలు జారీ చేసింది.
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువారం రూపకు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఐఏఎస్ అధికారిణికి బిగ్ రిలీఫ్. రోహిణి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని, అసత్య, ఆధారాలు లేని వార్తలు, ఇబ్బంది కలిగించే ఫోటోలను ప్రచురించకూడదని కూడా ప్రచార మాధ్యమాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఇప్పటికే చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కూడా రూపకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్ జడ్జి కేఎస్ గంగన్నావర్ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. తనపై ఇష్టారీతిన ఆరోపణలు చేయకుండా రూపను నిరోధించాలని కోరుతూ రోహిణి న్యాయస్థానానికి వెళ్లారు. ఇక్కడ ఆమెకు ఊరట దక్కింది.
అడ్వోకేట్ చన్నబసప్ప ఎస్ఎన్… రోహిణి తరఫున కోర్టులో సూట్ దాఖలు చేశారు. సైబర్ క్రైమ్ విభాగానికి హెడ్ గా ఉన్న సమయంలో రూపా మాడ్గిల్ తన క్లయింట్ మొబైల్ పోన్ నుండి అక్రమంగా సమాచారాన్ని సేకరించారని రోహిణి తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. అందుకే ఫేస్ బుక్ లో ఆమె ఫోటోలను అప్ లోడ్ చేశారని, ప్రయివేటు మొబైల్ నెంబర్ ను బహిర్గత పరిచారని తెలిపారు. దీంతో వందలాదిమంది అపరిచితులు ఆమెకు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. రూపతో పాటు 59 ప్రచార సాధనాలను ప్రతివాదులుగా గుర్తించి, ఆరోపణలు చేయకుండా తాత్కాలిక నిషేధాన్ని విధించింది.
నిన్నటి వరకు కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు రూప. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నారు రోహిణి సిందూరి. గతంలో జేడీఎస్ ఎమ్మెల్యే మహేష్ తో ఒక రెస్టారెంటులో సింధూరి దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఒక ఏఐఎస్ అధికారిణి… రాజకీయ నాయకుడిని ఎందుకు కలిశారని రూప అప్పుడు ప్రశ్నించారు. ఇది ఇద్దరి మధ్య విబేధాలకు దారి తీసింది. ఆ తర్వాత వారి మధ్య వివాదం పెరిగింది. తాజాగా… ఆదివారం రోహిణి ఫోటోలను రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఐఏఎస్ రోహిణి (IAS Rohini)కి చెందిన ఫోటోలను ఐపీఎస్ అధికారిణి రూప (IPS Roopa) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను గతంలోనే రోహిణి పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని ఆరోపించారు. తద్వారా వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారన్నారు. 2021 నుండి 2022 మధ్య వీటిని షేర్ చేసినట్లు చెప్పారు. అలాగే, అవినీతి ఆరోపణలు చేస్తూ… ముఖ్యమంత్రి బసవరాజ్కు, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూప చేసిన ఆరోపణలపై రోహిణి తీవ్రంగా స్పందించారు. తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, తన పరువుకు భంగం కలిగించేందుకు తన సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్లను సేకరించారని మండిపడ్డారు. నేను కొంతమందికి ఈ ఫోటోలు పంపినట్లు ఆరోపిస్తున్నారని, ఆ పేర్లు చెప్పాలని డిమాండ్ చేసారు. మనిషికి మానసిక ఆరోగ్యం చాలా పెద్ద సమస్య అని, డాక్టర్ల సహకారంతో దానిని తగ్గించాల్సి ఉంటుందన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారు అనారోగ్యానికి గురైతే ఎంతో ప్రమాదకరం అన్నారు. ఆ తర్వాత రూపకు లీగల్ నోటీసులు పంపించారు రోహిణి. తనకు క్షమాపణ చెప్పాలని, అలాగే రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు, ఇద్దరు అధికారిణులు ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి ఇద్దరిని బదలీ చేస్తూ, ఎలాంటి పోస్టింగ్ లేకుండా పెండింగులో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం.