WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్కు సుదీర్ఘ సెలవులు రానున్నాయి. ఈ నెల 27వ తేదీ (బుధవారం) నుండి 31(ఆదివారం) వరకు ఐదు రోజులు మార్కెట్ బంద్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రత్యేక సెలవు, గురువారం బక్రీదు, శుక్రవారం హమాలి కార్మికుల విజ్ఞప్తి మేరకు సెలవు, శని, ఆదివారం వారంతపు సెలవుల సందర్భంగా మార్కెట్ బంద్ ఉండనుంది.