ఏపీ ఈఏపీసెట్-2026 ప్రిలిమినరీ ‘కీ’, రెస్పాన్స్ షీట్లను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు https://cets.apsche.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలుంటే ఎల్లుండి ఉ.11 గంటలలోపు ఆన్లైన్లో తెలపవచ్చు. కాగా EAPCETకు 3.55 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.29 లక్షల మంది హాజరయ్యారు. MPC స్ట్రీమ్ 2.58 లక్షలు, BiPC స్ట్రీమ్ 70,929 మంది పరీక్ష రాశారు.