ATP: జిల్లాలోని MJP గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు జిల్లా కన్వీనర్ జమునా బాయి దరఖాస్తులను ఆహ్వానించారు. 5వ తరగతితో పాటు 6, 7, 8 తరగతులు, జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో 840, ఇంటర్లో 680 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు మార్చి 4లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.