Vishal కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్లో జరిగిన పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న 'మార్క్ ఆంటోని' అనే సినిమా సెట్లో ఈ ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Vishal కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్లో జరిగిన పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ అనే సినిమా సెట్లో ఈ ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా.. సెట్లో ఒక భారీ ట్రక్ అదుపు తప్పింది. మామూలుగా అయితే ఆ ట్రక్ గోడను ఢీ కొట్టి.. కొంత దూరం రావాల్సి ఉంది. కానీ గోడను బద్దలు కొట్టుకొని ఒక్కసారిగా చిత్ర యూనిట్ పైకి దూసుకొచ్చింది. అది సీన్లో భాగమేనని అంతా అనుకున్నారు. కానీ రెప్ప పాటు కాలంలో యూనిట్ మొత్తం అప్రమత్తమైంది. యాక్సిడెంట్ అని గ్రహించడంతో వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో విశాల్ కింద పడి ఉన్నాడు. కానీ వెంటనే కొన్ని క్షణాల వ్యవధిలో విశాల్ తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు విశాల్. దేవుడి దయ వలన కొన్ని క్షణాల వ్యవధిలో చావు నుండి తప్పించుకున్నాను.. అంటూ ఆయన ఈ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది.. ఎలా మిస్ ఫైర్ అయిందనేది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల ఆ వాహనం అదుపుతప్పినట్లు సమాచారం. అయితే విశాల్‌కు ఇలాంటి యాక్సిడెంట్స్ కొత్తేం కాదు. ఇటీవల లాఠీ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రెండు సార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నాడు. అయినా విశాల్ మాత్రం రిస్క్ చేస్తునే ఉన్నాడు. కానీ లేటెస్ట్ యాక్సిడెంట్ నుంచి మాత్రం.. విశాల్ తృటిలో తప్పించుకున్నాడనే చెప్పాలి. దీనిపై విశాల్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా యాక్షన్ సీన్స్, ఫైట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.