VZM: నెల్లిమర్ల అంబేద్కర్ గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 26, 27వ తేదీల్లో రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. సంస్థ నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసి, సీటు లభించని విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. 26న బాలికలు, 27న బాలురు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ర్యాంక్ కార్డు, ఆధార్ తీసుకురావాలన్నారు.