JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలోని ఆర్డీవోగా ఆర్.వి. రాధాబాయిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా ఈ నియామకం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆమె గతంలో వేములవాడ ఆర్డీవోగా పనిచేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్డీవో ధరంసోత్ వెంకన్నకు ఇంకా కొత్త పోస్టింగ్ ప్రకటించలేదు.