TG: SLBC సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సగటు వృద్ధి రేటు 8.2% ఉంటే, మన రాష్ట్రం 10.7%తో వేగంగా దూసుకుపోతోందని, తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని, బ్యాంకులు కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.