Pan India : గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ.. ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టాయి బడా హీరోల సినిమాలు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్2, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్.. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ సమ్మర్లో వరుస పెట్టి రిలీజ్ అయ్యాయి.
గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ.. ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టాయి బడా హీరోల సినిమాలు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్2, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్.. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ సమ్మర్లో వరుస పెట్టి రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఏడాది సమ్మర్లో మాత్రం పెద్దగా సందడి లేదు. సమంత ‘శాకుంతలం’, అఖిల్ ‘ఏజెంట్’ లాంటి సినిమాలు తప్పితే.. బడా హీరోల పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒక్కటి కూడా రిలీజ్‌కు రెడీగా లేదు. కానీ 2024 స్టార్టింగ్ నుంచి సమ్మర్ వరకు సినిమా జాతర జరగబోతోంది. ముందుగా సంక్రాంతికి ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ కాబోతోంది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాలు రాబోతున్నాయి. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న RC 15 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే సమ్మర్లో రావడం పక్కా. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పుష్ప2’ సమ్మర్లోనే ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అప్పుడే అంటున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్, ఏప్రిల్ 5న రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. ఇవే కాదు ప్రభాస్ చడీ చప్పుడు కాకుండా చేస్తున్న మారుతి ప్రాజెక్ట్ కూడా సమ్మర్లోనే అంటున్నారు. ఈ సినిమాలన్నీ వారం, రెండు వారాల గ్యాప్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. దాంతో 2024 సమ్మర్లో సినిమా జాతర ఓ రేంజ్లో ఉండబోతోందని చెప్పొచ్చు. అయితే వీళ్లలో ఒక్క పవర్ స్టార్ ప్రాజెక్ట్ తప్పితే.. మిగతా సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్‌లోనే రాబోతున్నాయి. కాబట్టి ఇది టాలీవుడ్ పాన్ ఇండియా ఎటాక్ అని చెప్పొచ్చు.