CSK మాజీ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, అభిమానులు, భారత జట్టుతో పాటు తాను ఆడిన SRH, GT, DC, CSK ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు తెలిపాడు. 2014లో CSK తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆయన, గత సీజన్లో మళ్లీ అదే జట్టుకు వచ్చాడు. ఈసారి వేలంలో ఆయనను ఎవరు కొనుగోలు చేయలేదు.