VZM: బొబ్బిలి AMC కార్యాలయం చుట్టు ఉన్న ప్రహరీ గోడ, గోదాములు పాడైపోయిన నేపథ్యంలో వాటిని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్దానిక కృష్ణాపురం మాజీ సర్పంచ్ గంట సింహాచలం కోరారు. ఈ మేరకు గురువారం MLA బేబినాయనకు వినతిపత్రం అందించారు. గోదాములు శిథిలావస్థకు చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గోదాములు బాగు చేసి పండించే పంటలు నిల్వ చేసుకునేలా చూడాలన్నారు.