AP: విజయవాడలో నడిరోడ్డుపై ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. పటమట హైటెన్షన్ 100 అడుగుల రోడ్డులో ఓ యువతి విషయంలో రోహిత్, ఓం అనే యువకులు థార్ జీపులతో ఢీకొట్టుకుంటూ హల్చల్ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వెళ్లే వరకు ఇద్దరు యువకుల్లో ఒకరు పరారీ కావడంతో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో జీపులో యువతి ఉన్నట్లు గుర్తించారు.