ASR: పాడేరు మోదకొండమ్మ జాతర సందర్భంగా నాలుగు రోజులపాటు పాడేరు ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులు నడిపి రూ.41.5 లక్షల ఆదాయం ఆర్జించింది. మొత్తం 100 అదనపు బస్సులను నడిపినట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ తెలిపారు. గత ఏడాది జాతర సమయంలో రూ.30.38 లక్షల ఆదాయం రాగా.. ఈసారి సుమారు రూ.11 లక్షలు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నారు.