విశాఖ: ప్రజలు ప్రతి శుక్రవారం ‘డ్రైడే’ పాటించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ఇంటిబయట పూల కుండీలు, కొబ్బరి బోండాలు, ఖాళీ బాటిళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వాటర్ ట్యాంకులపై మూతలు పెట్టాలన్నారు. దీర్ఘకాలికంగా నీటి నిల్వ ఉన్న చోట దోమలు వృద్ధి చెందుతాయని వివరించారు. విశాఖను దోమల రహిత నగరంగా తీర్చి దిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.