మెదక్ ఖిల్లా అభివృద్ధి, పరిరక్షణ కోసం త్వరగా సవరించిన అంచనాలు సమర్పించాలని పురావస్తు శాఖ డైరెక్టర్‌ను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. కోటను ప్రముఖ వారసత్వ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సమీకరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గతంలో ప్రతిపాదించిన రూ. 6.20 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రస్తుతం రూ.10 కోట్లకు సవరించారు.