SRD: జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో మహ్మద్ ఖలీల్, మహ్మద్ సిద్ధిక్ అహ్మద్ పాల్గొన్నారు.