PLD: గురజాల మండలంలోని 3 ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఏప్రిల్లో అనుమానాస్పదంగా యూరియా అమ్మకాలు నమోదవ్వడంతో అధికారులు విచారణ జరిపారు. విజ్ఞరాజ, ఉమ మహేశ్వరి, తారక రామా ఫర్టిలైజర్స్ దుకాణాల్లో తాత్కాలికంగా అమ్మకాలు నిలిపివేశారు. సరైన వివరణ ఇవ్వకపోతే లైసెన్సులు సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీఏవో జగ్గారావు హెచ్చరించారు.