నల్లగొండ: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్లో భాగంగా పానగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15-18 ఏళ్ల కౌమార బాలికలకు ప్రత్యేక ఆరోగ్య స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ చైతన్య మాట్లాడుతూ.. రక్తహీనత, పోషకాహార లోపం, నెలసరి పరిశుభ్రతపై అవగాహన అవసరమని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.