HYD: రోడ్డుపై విరిగిన చారల గీత కేవలం మార్కింగ్ కాదని, భద్రతాసూచిక అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ముందు రహదారి స్పష్టంగా, సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఓవర్టేక్ లేదా లేన్ మార్చడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ లేన్ క్రమశిక్షణ పాటిస్తూ, ప్రమాదకర ఓవర్టేక్లు నివారించాలని, రహదారి గుర్తులను గౌరవిస్తూ సురక్షితంగా డ్రైవ్ చేయాలన్నారు.