KNR: ఖాసీంపేట ఫీల్డ్ అసిస్టెంట్ జక్కనపల్లి శ్రీలతపై గ్రామస్థులు కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి గురువారం గ్రామాన్ని సందర్శించి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలను విచారించి పథకం అమలు విధానంపై ఆరా తీశారు. వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి, సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.