WNP: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం గోపాలపేట మండలంలోని ఐకెపి కేంద్రాలు,రైస్ మిల్లులను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సక్రమంగా తోకం వేసి, నాణ్యత ప్రమాణాలను పాటించాలని తెలిపారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు.