ATP: తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో ఇవాళ ఖలీల్ భాషాకు చెందిన బైకుకు అదే గ్రామానికి చెందిన ధనుంజయ రెడ్డి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బైకు పూర్తిగా దగ్ధమైపోయింది. ఖలీల్ భాషా, ధనుంజయ రెడ్డికి పాత కక్షలు ఉండేవి. ఈ కేసులో రూరల్ పోలీసులు ధనుంజయ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.