KRNL: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకింగ్ సేవలు ఈ నెల 23, 25, 26 తేదీల్లో వరుసగా 4 రోజులు అందుబాటులో ఉండవు. 23న నాలుగో శనివారం, ఆదివారం సెలవు దినాలు. 25, 26 తేదీల్లో పలు డిమాండ్లతో ఎస్బీఐ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు ఇవాళ పిలుపునిచ్చారు. దీంతో ఈ రెండు రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. 28న బక్రీద్ సెలవు కూడా ఉంది.