KMR: జుక్కల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్పంచుల సమావేశం నిర్వహించగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు కృష్ణను ఫోరమ్ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు.