ATP: జిల్లాలోని అంబేద్కర్ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. BRAGCET-2026 మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి దామోదర్ తెలిపారు. ఐదో తరగతి బాలురకు మే 26, బాలికలకు 27న కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంటర్ విద్యార్థులకు 29, 30న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.