కోనసీమ: అయినవిల్లి మండలం అయినవిల్లిలంక గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పరామర్శించారు. ప్రమాదంలో తీవ్ర నష్టం చవిచూసిన కుటుంబాలను స్వయంగా కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎంపీ, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.