AP: జనతా వారధి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. ‘మీ సమస్య.. మా బాధ్యత’కు ప్రజల్లో ఆదరణ పొందుతున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం బీజేపీ అర్జీలు స్వీకరిస్తుంది. ఇప్పటి వరకు 3,248 అర్జీలు స్వీకరించినట్లు మాధవ్ తెలిపారు. వాటిలో 2,180 సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ప్రజలకు -ప్రభుత్వానికి వారధిగా జనతా వారధి పని చేస్తోందని పేర్కొన్నారు.