BHNR: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఎండోమెంట్ అధికారి వెంకటలక్ష్మి సమక్షంలో ఛైర్మన్ గంజి నర్సింహా, సభ్యులు తాటిపాముల స్వామి గౌడ్, కోరబోయిన కవిత, ఎడ్ల సంజీవ రెడ్డి, ఉపేందర్ చారి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.