KRNL: పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య బాలసదన్‌లో పోక్సో చట్టంపై ఇవాళ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. జాగృతి యూనిట్ సభ్యుడు డాక్టర్. రాయపాటి శ్రీనివాస్ హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు.